మదనపల్లెలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు సబ్-కలెక్టర్ మురళీ స్థలపరిశీలన

0
256

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
రాష్ట్ర వ్యాప్తంగా లోకసభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.ప్రకటించిన నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అతిపెద్ద పట్టణమైన మదనపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతిచ్చారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీని పట్టణం సమీపంలో ఏప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆంశాన్ని పరిశీలించేందుకు మంగళవారం మదనపల్లి ఇన్-చార్జీ సబ్-కలెక్టర్ మురళీ అందుబాటులో ఉన్న, ప్రభుత్వ ఆధీనంలోని స్థలాలను పోతబోలు గ్రామపంచాయతీ, నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లి గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లెకు మంజూరు అయిన మెడికల్ కళాశాలకు కావాల్సిన స్థలాల లభ్యతను జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మదనపల్లి, నిమ్మనపల్లి తహసీల్దార్ లతో కలిసి శానిటోరియం, రాచవేటి వారి పల్లి వద్ద ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ముందుగా మదనపల్లి రూరల్ మండలానికి సంబంధించి శానిటోరియం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించి సుమారు 50 ఎకరాలు విస్తీర్ణం గల భూమిని అందుబాటులో ఉండే విధంగా మ్యాపింగ్ చేయాలని ఆయా ప్రాంతాల సర్వేయర్లను సబ్ కలెక్టర్ ఆదేశించారు.