ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక -అమరులకు సి.ఎం.కె.సి.ఆర్ నివాళి

0
194

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. హైదరబాద్ తో పాటు రాష్ట్రంలోని గ్రామాలలో సైతం తెలంగాణ ఆవిర్బవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తెలంగాణా ఆవిర్బవ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్‌ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గోని అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సిద్దిపేటలో అపశ్రుతి
సిద్దిపేట లో మంత్రి హరిష్ రావు హాజరైన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ భర్త అశోక్‌ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటనలో అంగన్‌వాడీ ఆయా కలవ్వకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

తెలంగాణ ప్రజలకు పలువురు శుభాకాంక్షలు
తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదిలు తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు.
ఉపరాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడు తన సందేశంలో ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అని తెలిపారు.
ప్రధాని మోది తన సందేశంలో కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.అని పేర్కొన్నారు.