ఏపి సి.ఎం.వై.ఎస్.జగన్ పర్యటన వాయిదా

0
131

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి ముఖ్యమంత్రి వై.యఎస్. జగన్ మెహన్ రెడ్డి మంగళవారం జరగాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో కరోనా ఉదృతి అధికంగా ఉండడం ఇతర రాష్ట్రాలతో ఢిల్లీ కున్న సరిహద్దులు మూసివేసిన తరుణంలో ఈ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. అయితే, పర్యటన వాయిదాకు గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. జగన్ మళ్లీ ఢిల్లీ ఎప్పుడు వెళ్లేది త్వరలో ఖరారు అవుతుందని సి.ఎం. కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది.మంగళవారం జగన్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని సమస్యలు, ఏపిలో ప్రతిపక్షం కోర్టుల ద్వారా పాలనను ఏవిధంగా అడ్డుకొంటోంది లాంటి విషయాలను కేంద్ర హోం మంత్రికి వివరిస్తారనే ప్రచారం జరిగింది.