ఏపిలో 12613 పరీక్షలు – 82 పాజిటివ్ కేసులు

0
63

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం గడిచిన 24 గంటల్లో 12,613 కరోనా పరీక్షలు నిర్వహించగ, అందులో 82 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ 24 గంటలలో 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో నేటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2209 చేరింది. కాగా సోమవారం మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో మెుత్తం 3,200 కరోనా కేసులు నమోదవ్వగా,ఇందులో 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం 927 మంది వివిధ కోవిడ్‌ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. లాక్ డౌన్ సడలింపులు, రైళ్లు, బస్సుల రాకపోకలతో కేసుల సంఖ్య తగ్గడం లేదు.