ఆ పోలీస్ ఇంట్లో 11 మంది కరోనా పాజిటివ్ – ఎలా వచ్చిందంటే…!!

0
199

మనఛానల్ న్యూస్ – హెల్త్ డెస్క్
పాపం పోలీసులు రాత్రినక…..పగలనక, ఎండనక..వాననక, చలినక…వేడనక.. ఖాకీ దుస్తులతో రోడ్లపై ఉద్యోగాలు చేస్తూ..జనాలకు కరోనా రాకుండా చూస్తుంటే…ఆ కరోనా భూతం పోలీసులనే టార్గట్ చేసినట్లు కనిపిస్తోంది. హైదరబాద్ లో నిర్వహించిన కరోనా పరీక్షలో ఓ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కుటుంబంలోని 11 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో జంటనగరాలలో పోలీసులు ఉలిక్కిపడ్డారు.

నగరంలో పాతబస్తీలో నివాసముంటున్న 50 ఏళ్లు పైబడిన ఓ ఏఎస్సైహైదరబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.అలాగే ఆయన కుమారులు ఇరువురు పోలీసు కానిస్టేబుల్స్ గా నగరంలోనే డ్యూటి చేస్తున్నారు. అందరు కలిసి ఒకే చోట నివాసం ఉంటున్నారు. ఈ పోలీసు కుటుంబంలో ఒకేసారి ఏకంగా 11 మందికి పాజిటివ్ రావడం నగరంలో సంచలనంగా మారింది. వీరి ద్వారా మరెంత మందికి కరోనా సోకిందో అంతుచిక్కడం లేదు. ఇటివల కొంత కాలం క్రితం ఏఎస్సై మనవడికి అనారోగ్యంగా ఉండటంతో లోకల్ గా ఉన్న ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. రెండు రోజుల ట్రీట్ మెంట్ అవసరం ఉండడంతో ఏ.ఎస్.ఐ రాత్రుళ్లు మనవడి కోసం అతడితోనే గడిపారు. ఈపరంపరలో పిల్లాడిని డిశార్చ్ చేసి ఇంటికి వెళ్లిన రెండు రోజుల తర్వాతఆయనకు దగ్గు, జలుబు రావడంతో ఆసుపత్రి వాతవరణం బాగలేక ఇలా వచ్చిందనుకొన్నారు. అయితే, అనుమానం వచ్చి సెలవు పెట్టి కోవిడ్ పరీక్షలు చేయించుకోగ,పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులందరికి పరీక్షలు జరపగ, ఆయన భార్య, కుమారులు, కోడల్లు,మనమళ్లు అందరికి కరోనా సోకినట్లు తేలడంతో అందరికి వైద్యం అందించడం మెుదలుపెట్టారు. ప్రస్తుతం వారంతా గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంతో శ్రమించి ప్రజలకోసం పనిచేసే పోలీసులు కాస్తాంత ముందు జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేదనిపలువురు అంటున్నారు.ఉహించని ఆపరిణామంతో ఆసుపత్రి పాలైన ఆకుటుంబం కరోనాను జయించి అరోగ్యంగా భయటకు రావాలని ఆశిద్దాం..దేశ వ్యాప్తంగా ఇలాంటి పోలీసులు ఎంతో మంది కరోనాతో పోరాటం చేస్తూ నిజమైన హీరోలుగా నిలుస్తున్నారు…వారందరికి మనఛానల్ మనస్పూర్వక సెల్యూట్ అందిస్తోంది.