పశ్చిమ బెంగాల్ లో మంత్రికి కరోనా పాజిటివ్

0
123

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కెబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న సుజిత్ సేన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో పశ్చిమ బెంగాల్‌లో కరోనా కలకలం రేగింది.మంత్రి సుజిత్ బోస్‌ను ఆయన భార్య, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ పాటించాల్సిందిగా వైద్యులు సూచించారు. తాజా పరీక్షలలో ఆయన భార్యకు కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.దీంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వం అలర్ట్ అయింది. శుక్రవారం ఒక్క రోజే 344 కేసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. ఇందులో 87 కేసులు కోల్‌కత్తా నగరంలోనే ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,536కు చేరింది.