నేడు ఏపిలో రైతు భరోసా సేవా కేంద్రాలు ప్రారంభం

0
407

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో రైతుల కోసం సరికొత్త పథకాన్ని వై.ఎస్ జగన్ ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఈ కేంద్రాలలో వ్యవసాయ సంబంధ సేవలన్నింటిని ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రారంభిస్తున్న రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటిని ప్రారంభించనున్నారు.

రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తాయి ?

  1. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలు , ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తూ నిరంతంరం వారికి అండగా నిలుస్తాయి.
  2. రైతులకు నిత్యం విజ్ఞానం అందిస్తూ.. మారుతున్న విధానాలపై శిక్షణ ఇస్తాయి.
  3. గ్రామాలలో రైతుల పండించే పంటలకు సంబంధించిన సమగ్ర వివరాలను రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రతిరోజు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి రైతులకు మెరుగైన సలహాలు, సూచనలు అందిస్తారు.
  4. జిల్లా స్థాయిలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ ను నియమించింది. రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షంలో వెంటనే జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం ఆర్బీకే నుంచి ప్రారంభం.
  5. రాష్ట్రంలో 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘కియోస్క్‌’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుతాయి. ఇది దేశ చరిత్రలోనే తొలి ప్రయోగం.దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి.
  6. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు.అందించే ‘ఏటీఎం’ల వంటివే ఈ ‘కియోస్క్‌’లు!

కియోస్క్‌లు ఎలా పని చేస్తాయంటే.. ??????

ఈ డిజిటల్‌ కియోస్క్‌ ఓ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్‌ స్క్రీన్, ఫ్రంట్‌ కెమేరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని– ధర్మల్‌ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్‌పుట్, యూఎస్‌బీ చార్జింగ్‌ స్లాట్, ఏ–4 కలర్‌ ప్రింటర్, ఈ పాస్‌ మిషన్, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్‌ రీడర్‌ నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్‌కు– దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను అనుసంధానం చేశారు.