చిరంజీవి ఇంట్లో సినిమా ప్రముఖల భేటి – కరోనా కష్టకాలంలో సినిమా రంగం భవిష్యత్ పై చర్చ

0
198

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
కరోనా కష్ట కాలంలో సినిమా రంగాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రముఖ సినీ హీరో మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) సభ్యులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమపై ఆధారపడ్డ కార్మీకులు, సినిమా ఆర్టీస్ట్ ల సంక్షేమం కోసం తాము స్థాపించిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ ద్వారా ఏవిధంగా ఆదుకోవాలనే దానిపై పరిశ్రమ పెద్దలు చర్చించారు. ఇప్పటికే ఈ ఛారిటీ ఆధ్వర్యంలో తొలి విడత సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తాజాగా మరో మారు సినీ కార్మీకులకు ఏలాంటి సాయంపై అందించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటివల తెలంగాణ సి.ఎం. కె.సి.ఆర్. తో పరిశ్రమ పునర్ ప్రారంభంపై జరిగిన చర్చలు, ఏపి సి.ఎం. వైయఎస్ జగన్ నుంచి వస్తున్న సహాయం గురించి చర్చించారు. అలాగే షూటింగ్ లు ఏవిధంగా ప్రారంభించాలి. కరోనా కోసం ముందస్తుగా ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను చర్చించారని తెలుస్తోంది. గత సమావేశంలో బాలకృష్ణకు ఆహ్వానం అందకపోవడం, దానిపై ఆయన విమర్శలు చేయడం, ఇందుకు ప్రతిగా నటుడు, నిర్మాత నాగబాబు బాలకృష్ణ కు కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయం కూడ వారి సమావే శంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌. శంకర్‌, సి.కళ్యాణ్‌, బెనర్జీ, దామోదర్‌, పాల్గోన్నట్లు తెలిసింది.