కర్నాటక కాంగ్రెస్ లో సంక్షోభం – 22మంది ఎం.ఎల్.ఎలు బిజెపి లోకి..

0
271

మనఛానల్ న్యూస్ – బెంగళూర్
కర్నాటకలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంక్షోభం రాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కర్నాటక లో అధికార బిజెపి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని అదును చూసి దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎం.ఎల్.ఏలకు గాలం వేసే ఆకర్ష్ పథకాన్ని ప్రారంభించింది. కర్నాటకకు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఎలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ శుక్రవారం ఆ రాష్ట్ర మంత్రి సురేష్ జర్కోలి సంచలన ప్రకటన చేశారు.ఇందులో భాగంగా 4గురు ఎం.ఎల్.ఏలను తాను శనివారం ముఖ్యమంత్రి యడుయూరప్ప వద్దకు తీసుకెళ్లుతున్నట్లు ప్రకటించారు.అయితే తమ పార్టీలోకి కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు తీసుకోవడం చాలా మంది బిజెపి ఎం.ఎల్.ఏలకు ఏమాత్రం ఇష్టం లేదని ఆ మంత్రి వెల్లడించారు.అధిష్టానాన్ని ఒప్పించి వారిని పార్టీలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో కర్నాటకలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారబోతున్నట్లు కనిపిస్తోంది. బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్న కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలలో బసవరాజ్ గౌడ్ పాటిల్, నిరాని, ఉమేష్ కత్తిలాంటి వారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.