ప్రముఖ నటి వాణిశ్రీ తనయుడు ఆత్మహత్య

0
265

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
ప్రముఖ తెలుగు సినీ నటి వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినవ్ వెంకటేష్ కార్తీక్ (40) మానసిక ఒత్తుళ్ల కారణంగా తన సొంత పామ్ హౌస్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని చెంగళ్ పట్టు జిల్లా తిరుక్కలికుండ్రంలో డాక్టర్ అభినవ్ ఇటివల ఓ ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. లాక్ డౌన్ కారణంగా అదే ఫామ్ హౌస్ లో గత కొంత కాలంగా ఉంటున్నారు. బెంగుళూర్ లో ఓ మెడికల్ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అభినవ్ మానసిక ఒత్తిళ్లతో బాధపడు తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే అభినవ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.