సి.టి.ఎంలో(మదనపల్లి) మరో రెండు పాజిటివ్ కేసులు – ఇరువురు లారీ డ్రైవర్లే

0
429

మనఛానల్ న్యూస్ – మదనపల్లి

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో కోయంబేడు నుంచి వచ్చిన వారి ద్వారా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మదనపల్లి డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ బుధవారం తెలిపారు. మదనపల్లి మండలం సి.టి.ఎమ్.పి.హెచ్.సి.పరిధిలోని మిట్టపల్లె గ్రామంలో ఇప్పటికే పాజిటివ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలో వారి ప్రాథమిక కాంటాక్ట్స్ గా ఉన్న ఇరువురు లారీ డ్రైవర్లను క్వారంటైన్ కు తరలించగా బుధవారం వారికి పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. వీరు మిట్టపల్లి, నాయనివారి పల్లి గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు.నూతన పాజిటివ్ రోగులని చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి ప్రత్యేక వాహనంలో బుధవారం తరలించారు.అలాగే వీరి  యెుక్క ప్రైమరీ కాంటాక్ట్స్ ని  తిరుపతి వికృతమాల క్వారెంటైన్ కు ప్రత్యేక వాహనం ద్వారా పంపామని అలాగే ద్వితీయ పరిచయస్థులను హోమ్ క్వారెంటైన్ లో ఉంచి వారికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.  ఆశా కార్యకర్తలు మరియు గ్రామ వాలేంటీర్ ల సహాయం తో ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలు గల వారిని గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో హైపోక్లోరిన్  ద్రావణాన్ని పిచికారీ  చేయిస్తున్నామని,పారిశుద్ధ్యం, రెడ్ జోన్ మ్యాపింగ్ వంటి విధులు సంబంధిత శాఖల సిబ్బంది ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.రెడ్ జోన్ పరిధిలోని రక్తపోటు, సుగర్, కాన్సర్,గుండెసంబంధ వ్యాధులు, మూర్ఛ వ్యాధి గ్రస్థులు మరియు గర్భవతులు, శిశువులు,బాలింతలు వారికి డాక్టర్ వై.ఎస్.ఆర్.టెలి మెడిసిన్ ద్వారా మందులు ఇంటివద్దకే చేరుస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో మదనపల్లి డివిజన్ డిప్యూటీ. డి.ఎమ్. హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్, సి.టి.ఎమ్.వైద్యాధికారి డాక్టర్ జాహ్నవి, డివిజనల్ హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,పోలీస్ శాఖ వారు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు