మదనపల్లి ఇన్-చార్జీ సబ్ -కలెక్టర్ గా చిత్తూరు డి.ఆర్.డి.ఎ పి.డి. మురళీ నియామకం

0
365

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లె రెవెన్యూ డివిజన్ పూర్తి అదనపు బాధ్యతల సబ్ కలెక్టర్ గా చిత్తూరు జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐ.ఎ.ఎస్ అధికారిణి కీర్తి చేకూరి తూర్పు గోదావరి జిల్లా విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్, అభివృద్ధి జేసీగా పదోన్నతిపై బదిలీ కావడంతో మదనపల్లి సబ్ -కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఈస్థానంలో పి.డి మురళిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్.నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. చేకూరి కీర్తి స్థానంలో ట్రైనీ కలెక్టర్
పృథ్వీ తేజ్ ని వారం రోజుల పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ ఇన్-చార్జీగా నియమించారు. అయితే ఆయనను మంగళవారం రాత్రి శిక్షణ కోసం విద్యుత్ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన స్థానంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మురళికి పుల్ అడిషనల్ ఛార్జ్ సబ్ కలెక్టర్ గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో బుధవారం సాయంత్రం ఎఫ్ ఏసీ సబ్ కలెక్టర్ గా మురళీ బాధ్యతలు తీసుకున్నారు.మురళీ గతంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్లో కలకడ, ములకలచెరువు తదితర మండలాలలో గతంలో తహసీల్దార్ గా పనిచేసిన అనుభవం ఉంది.ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.