తెలంగాణాలో నేడు 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
147

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణాలో బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క జి.హెచ్.ఎం.సి పరిధిలోనే 15 కేసులు, వలస కార్మీకులలో 17 కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యశాఖ వెల్లడించింది.బుధవారం నాటికి రాష్ట్రంలోో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 1661కి చేరింది. ఇందులో 608 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 1013మంది ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయ్యారు.మంగళవారం నలుగురు కరోనా వ్యాధితో మరణించగ, నేడు మరో ఇరువురు మరణించారు. దీంతో తెలంగాణాలో కరోనాతో మరణించినవారి సంఖ్య 40కి చేరింది.