మదనపల్లి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అగ్నిప్రమాదం

0
310

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడా లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దీనితో బ్యాంక్ లోని వస్తువులు,డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. ప్రమాదం సమాచారం తెలుసుకొన్న వెంటనే బ్యాంక్ ఉద్యోగులు,అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.