తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

0
46

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణాలో హైదరబాద్ మినహా రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి.రెండు నెలలుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న జనాలు బస్సులు రాకతో తమ జనజీవనాన్ని కొనసాగించడం మెుదలు పెట్టారు.కరోనా నేపథ్యంలో ప్రయాణికులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం ప్రజలను కోరింది. మాస్క్లు ధరించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ముందస్తు జాగ్రతలు తీసుకోవాలి. ఆర్టీసీ సిబ్బంది సైతం ఈ విషయంలో తప్పక నిబంధనలు పాటించాలి. అంతరాష్ట్ర సర్వీసులను హైదరబాద్ నగరంలోకి ప్రవేశించకుండ నగరం వెలుపల వరకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ప్రజలు ఆటోలు, క్యాబ్స్, స్వంత వాహానాలలో తాము వెళ్లాల్సిన ప్రాంతాలకు వెళ్లుతున్నారు.జిల్లాలకు వెళ్లాల్సిన నగరవాసులు కూడ ఆయా పాయింట్లకు స్వంతంగా చేరుకోని అక్కడి నుంచి బస్సులలో వెళ్లుతున్నారు. కరీంనగర్ వైపు వెళ్లే బస్సుల కోసం జూబ్లీ బస్టాండ్, ఖమ్మం, నల్లోండ వైపు వెళ్లాల్సిన వారు హయత్ నగర్ బస్టాండుకు,మహాబూబ్ నగర్ వైపు వెళ్లాల్సిన వారు అరాంఘర్ బస్టాండుకు, వరంగల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ ఛౌరస్తాకు,కల్వకుర్తి, అచ్చంపేట, కొల్హాపూర్ వైపు బస్సులకోసం పహడి షరీఫ్ బస్టాండ్ వద్దకు వెళ్లాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. 10 సంవత్సరాలలోపు పిల్లలు, 60 సంవత్సరాలపైబడిన వృద్ధులకు బస్సు ప్రయాణాలు నిషేధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.