అమెరికాలో కరోనాకు వ్యాక్సిన్ పరిశోధనలో పురోగతి – mRNA-1273 వ్యాక్సిన్

0
177

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
కోవిద్-19 కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుకోవడంలో అమెరికాలో ముందడుగు పడింది. అమెరికాకు చెందిన మోడెర్నా అనే బయోటెక్నాలజీ కంపెనీ ‘mRNA-1273’ పేరుతొ తయారు చేసిన వ్యాక్సిన్.. మొదటి దశలో మనుషుల మీద చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భాగంగా, 8 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు రెండు డోసుల చొప్పున టీకా ఇచ్చారు. వారిలో కొన్ని రోజులకు కరోనాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ సిస్టం యాక్టివేట్ అయి యాంటీబాడీలు తయారయ్యాయి. ఆ యాంటీబాడీలను ల్యాబ్ లో హ్యూమన్ సెల్స్ లో ఉంచి ప్రయోగం చేయగా, అవి కరోనా వైరస్ కణాలు రెప్లికేషన్ కాకుండా పూర్తిగా అడ్డుకున్నాయి. కరోనా వైరస్ సోకి, కోలుకున్న వ్యక్తుల్లోని యాంటీబాడీలతో ఇవి కూడా సరిగ్గా సరిపోవడంతో కరోనాకు వ్యాక్సిన్ దాదాపు లభ్యమైనట్లు మోడెర్నా సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టాల్ జాక్స్ వెల్లడించారు. దీనిని త్వరలో తాము సెకండ్ ఫేజ్ లో 600 మందిపై, వచ్చే జూలైలో థర్డ్ ఫేజ్ లో వేలాది మందిపై ప్రయోగం చేయనున్నట్లు కంపెనీ అంటోంది. ఈ మూడు దశలలో ప్రయోగాలు విజయంతమైతే కరోనా వ్యాక్సిన్ జనాల వద్దకు ఆగష్టు నుంచి దొరుకుతుంది.