మంచి ఆహారమే కరోనాకు మందు.. !అందుకే రోజు ఇవి తినండి..!!

0
1043

మనఛానల్ న్యూస్ – హెల్త్ డెస్క్
ప్రస్తుతం ప్రజలను పీడిస్తున్న అతిపెద్ద రోగం కరోనా..దీనికి మందు లేదు కేవలం ముందు జాగ్రత్తే మందు. ఇందులో భాగంగా మనం నిత్యం మంచి ఆహారం తీసుకొని శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకొంటేనే కరోనా వైరస్ మన దరిదాపులకు రాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోగనిరోధక శక్తి లేని వారేకే త్వరగా సోకి అనారోగ్యానికి గురిచేస్తోందని వెల్లడి అయింది. ప్రస్తుతానికి మందు లేనుందున మనం తీసుకొనే మంచి ఆహారమే మందుగా భావించి..అందుబాటులో ఉండే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో ఏయే పండ్లు.. ఆకుకూరలు..కూరగాయలు.. పప్పు దినసులు తినాలో ఇక్కడ చూద్దాం.

సి విటమిన్ పుష్కలంగా దొరికే పండ్లు..
సి-విట మిన్ అధికంగా నారింజ‌, నిమ్మ‌, బ‌త్తాయి, కివీలు, స్ట్రాబెర్రీలు, బొప్పాయి త‌దిత‌ర పండ్ల‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అవి చురుగ్గా ప‌నిచేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల‌పై ఆ ర‌క్త‌క‌ణాలు పోరాడుతాయి. మ‌న‌కు వ్యాధులు, వైర‌స్‌ల నుంచి తక్షణ ర‌క్ష‌ణ కల్పిస్తాయి. మ‌నకు అత్యంత అందుబాటులో ఉండే నిమ్మ‌ కాయల ర‌సంలో విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది.రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు గ్లాసుడు నీ‌‌ళ్లలో కలుపుకొని తాగండి.
క్యాప్సికమ్ (ఎరుపు రంగు)
ఇందులో రోగనిరోధక శక్తిని ఇచ్చే విట‌మిన్ సి అన్నిటికన్నా రెండింతలు అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే విట‌మిన్ సి అధిక పాళ్ళలో పొందవచ్చు. త‌ద్వారా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

బ్ర‌కోలి…
బ్ర‌కోలి అనేది కేబీజీ పువ్వు లాగ ఉంటుంది. ఇది మనకు పెద్దగా లభించదు. పెద్ద పెద్ద నగరాలు, షాపింగ్ మాల్స్ లో లభిస్తుంది. విట‌మిన్ ఎ, సి, ఇ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసి వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.
వెల్లుల్లి…(తెల్లగడ్డ)
భారతీయ ఆహారంలో అన్ని రకాల కూరలలో దాదాపుగా వెల్లుల్లి వినియోగిస్తారు. వెల్లుల్లిలో యాల్లిసిన్ అనబ‌డే పోష‌క ప‌దార్థం ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా చూస్తుంది.
అల్లంతో కరోనాకు కళ్లెం
దీనిని భారతీయులు చాలా రకాల ఆహారాలలో వినియోగిస్తారు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి గొంతు స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.గొంతులో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.వైరస్ లను దాదాపు గొంతులోనే ఇది హరించివేస్తుంది.
పాల‌కూర
అన్ని ప్రాంతాలలో అత్యంత చౌకగా దొరికే ఆకుకూర పాలఆకు. పాల‌కూర‌లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచుతాయి.
పెరుగుతో కరోనాకు పరుగు
పెరుగు అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. పెరుగులో విట‌మిన్ డి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకలలో సామర్థ్యాన్ని పెంచుతుంది.శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లో ఉండే లోపాల‌ను స‌రిచేసి ఆ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేసేలా చేస్తుంది.
బాదంప‌ప్పు -కరోనాకు తుప్పు
ఇది కొంత ఖరీదు అయినప్పుటికి అత్యుత్తమైన ఆహారం. బాదంప‌ప్పులో విట‌మిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ‌ నిరోధ‌క వ్య‌వస్థ‌కు ఔష‌ధంలా ప‌నిచేస్తుంది.శరీరంలోకి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది.కరోనా వేళతో పాటు మిగిలిన కాలంలో కూడ రోజుకు కనీసం 5 నుంచి 10 గింజలు నీళ్లలో నానబెట్టుకొని తింటే మంచింది. మంచి ఫలితాలను ఇస్తాయి.
ప‌సుపు…
భారతీయుల వంటకాలలో పసుపు లేని వంట ఉండకపోవచ్చు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. సూక్ష్మ‌క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి.
ఈ ఆహార పదార్థలను రోజు ఏదోక రూపంలో తీసుకోండి. రోగనిరోధకశక్తిని పెంచుకోండి. శరీరంలోకి ఏలాంటి వైరస్ లు రాకుండ జాగ్రత్తగా ఉండండతో కరోనాకు పరుగుి.