ప్రముఖ హింది నటుడు ఇర్పాన్ ఖాన్ కన్నుమూత

0
225


మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

  • ప్రముఖ హింది సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం ఉదయం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు, స్వస్థలం జైపూరు. ఈయన గత కొంతకాంగా ముంబాయిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 25వతేదిన ఆయన తల్లి అనారోగ్యంతో మరణించింది. అయినా లాక్ డౌన్ తో తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేక పోయారు. ఈయన నటించిన మిలినీయమ్ డాగ్ సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది.2011లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇర్పాన్ తెలుగులో సైనికుడు సినిమాలో నటించారు.ఈయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోది,పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలిపింది. చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు లు తమ సంతాపం ప్రకటించారు. ఇర్ఫాన్ ఖాన్ భౌతికకాయాన్ని ముంబాయిలో ఓ స్మశానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.