కరోనాపై తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం

0
194

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత్ లో ప్రవేశించకుండ దేశవ్యాప్తంగా వైద్య శాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంది. ఇందులో భాగంగలో ఏపి, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు తమ వైద్య, ఆరోగ్యశాఖలను అప్రమత్తం చేశాయి. ప్రజలను చైతన్యపర్చే కార్యక్రమాలను మమ్మురం చేశారు. ముందస్తు జాగ్రత్తలపై కరపత్రాలు, ప్రకటనలు సిద్దం చేశారు.హైదరబాద్ విమానాశ్రయంలో విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అనుమానమున్న వారికి అన్నిరకాల పరీక్షలు నిర్వహించి వారిని అజ్వర్వేషన్ లో ఉంచారు. విశాఖపట్టణం, తిరుపతి, గన్నవరం లాంటి విమానాశ్రయాలలో సైతం ఇదే విధంగా ముందస్తు చర్యలు తీసుకొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య,ఉద్యోగం, వ్యాపార నిమిత్తం చైనా దేశానికి వెళ్లినవారి వివరాలను తెలుసుకొని వారిని గుర్తించి సుమారు 10 రోజల పాటు పర్యవేక్షణలో ఉంచి అనంతరం వారిని స్వస్థలాలకు పంపించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. చైనాలో ఉన్న తెలుగువారు ప్రస్తుత పరిస్థితులలో తాము స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలను రద్దు చేసిన కారణంగా వారు కనీసం విమానాశ్రయానికి సైతం రాలేక పోతున్నట్లు వారు ఫోన్ల ద్వారా బంధువులకు తెలియచేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంది.