మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు జనవరి31 మరియు ఫిబ్రవరి1వతేదిన రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. బ్యాంక్ ఉద్యోగులు తమ వేతనాలను 20శాతం పెంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతుండటంతో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.దీంతో ప్రజలు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు పడనున్నారు. వేతనాల పెంపు అంశంపై ప్రధాన కార్మిక కమిషనర్‌తో తాజాగా ఉద్యోగ సంఘాలు జరిపిన చర్యలు విఫలమయ్యాయి. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన సమ్మెకు సన్నద్దమయ్యారు.