కలవరపెడుతున్న కరోనా వైరస్ – ఈ దశాబ్ధపు తొలి వైద్య సవాలు

0
332

మనఛానల్ న్యూస్ – హెల్త్ డెస్క్
చైనా లో కనపడిన కరోనా వైరస్ ఆదేశాన్నే కాకుండ ప్రపంచాన్నే కలవరపెడుతొంది. చైనాను గత నెలరోజులుగా ఈ వ్యాధి నిద్రలేకుండా చేస్తోంది. ఈ కొత్త రకం వైరస్ ద్వారా చైనా లో నేటి వరకు 100 మంది మరణించినట్లు సుమారు 10వేల మంది ఈ వ్యాధి లక్షణాలతో వైద్యం పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థికంగా ఎంతో బలంగా ఎదుగుతున్న చైనాకు కరొనా వైరస్ భూతంలా కనిపిస్తోంది. ఈ వ్యాధి రోజురోజుకి విదేశాలకు విస్తరిస్తుండడంతో ప్రపంచమంతా కరొనా వైరస్ అంటే వణికిపోతున్నారు. సాధరణ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుటికి,రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వారిలోకి వేగంగా కరోనా వైరస్ చొరబడి వారిని కబళించేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.జలుబు, దగ్గు, అలర్జీ లాంటి వ్యాధులు ప్రస్తుతం సాధరణమైపోయింది. అన్నిరకాల కాలుష్యం పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో జలుబు, దగ్గు వంటి వ్యాధులు వ్యాప్తి చెందిన తక్షణమే అజాగ్రత్త వహిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కరోనా వైరస్ కు ఏలాంటి టీకాలు,మందులు అందుబాటులో లేవు. కేవలం ముందు జాగ్రత్తగా ఉండడమే ఉత్తమంగా వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ చైనాలో అధికంగా ప్రభావం చూపుతుండగా, చైనా వారు వివిధ దేశాలలో విరివిగా ఉంటుండడం వల్ల రాకపోకలు సాగిస్తే వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం సైతం విమానాల ద్వారా విదేశాల నుంచే భారత్ లోకి వచ్చే వారికి విమానాశ్రాయాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రోగ లక్షణాలు ఉన్నవారికి తక్షణ వైద్యం అందిస్తున్నారు. కరోనా వైరస్ వైద్యరంగానికి ఓ సవాలుగా నిలుస్తోంది. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు విరుగుడు మందు కనిపెట్టే పనిని తీవ్రం చేశారు. ఇప్పుటికే దీనిపైన ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు మెుదలు అయ్యాయి.త్వరలో ఏదోక విధంగా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

కరోనా వైరస్ రాకుండ ఉండేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు

కరోనా వైరస్ వ్యాధి లక్షణాలేమిటి ?
ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్‌ను కలవాలి.

వైరస్ ఎలా వ్యాపి చెందుతుంది ?
ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు మాత్రమే వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా… పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే… రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా… అక్కడ ఉండే వైరస్… బాడీపైకి వచ్చి… క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి. అంతే వైరస్ వచ్చినట్లే. ఇవి ఎంత వేగంగా వస్తాయంటే… చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.

ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు (వ్యాక్సిన్) లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు. అయినా ఆ ఛాన్స్ డాక్టర్లు మీకు ఇవ్వరు. ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్లు తెలిస్తే… డాక్టర్లు ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచేస్తారు.