కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘గుడ్‌ న్యూస్‌’…10 రోజుల్లో రూ.150 కోట్ల వసూళ్లు

0
370

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
బాలీవుడ్‌లో అగ్రశ్రేణి కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌,కరీనా కపూర్ల గుడ్‌న్యూస్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ దబంగ్‌ 3 నుంచి పోటీ ఎదురైనా పదిరోజుల్లో ఈ మూవీ రూ.150 కోట్లకు చేరువై నిర్మాతలకు గుడ్‌న్యూస్‌ పంచింది.2019లో చివరి మూవీగా విడుదలైన ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది.

తొలి వారాంతంలో రూ.65.99 కోట్లు రాబట్టిన గుడ్‌న్యూస్‌ రెండోవారంలో శుక్రవారం వరకూ రూ.136 కోట్లు ఆర్జించింది.ఇక శనివారం రూ.11.70 కోట్లు వసూలు చేసి రూ.150 కోట్ల మార్క్‌కు చేరువైంది. దిల్జిత్‌ దొసాంజ్‌,కియారా అద్వానీ ఇతర ప్రధాన పాత్రలతో దర్శకుడు రాజ్‌ మెహతా తెరకెక్కించిన గుడ్‌న్యూస్‌ మూవీ ప్రేక్షకులు,సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.