మళ్లీ పసిడి ధర పరుగులు…రూ.40 వేలకు చేరుకున్న 10 గ్రాములు

0
307

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్క్‌ డెస్క్‌
మళ్లీ పసిడి ధరలు పెరుగుతున్నాయి.అమెరికా,ఇరాన్‌ల మధ్య వార్‌ ఎఫెక్ట్‌తోపాటు,అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.నేడు దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం,వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,240, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.41,230,ప్రొద్దుటూరులో రూ.40,100,చెన్నైలో రూ.40,050గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,380,విజయవాడలో రూ.37,200,విశాఖపట్నంలో రూ.37,930,ప్రొద్దుటూరులో రూ.36,950,చెన్నైలో రూ.38,150గా ఉంది.వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,700,విజయవాడలో రూ.48,700, విశాఖపట్నంలో రూ.48,500,ప్రొద్దుటూరులో రూ.48,300,చెన్నైలో రూ.51,400 వద్ద ముగిసింది.