ఎసిబి పనితీరుపై సి.ఎం.జగన్ అసంతృప్తి – 3నెలలో మార్పుకు ఆదేశాలు

0
292

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) పనితీరుపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆశాఖ అధికారుల పనితీరుపై అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. 3 నెలల్లో శాఖలో సమూల మార్పులు జరగాలని, ప్రజల అవినీతి నిరోధక శాఖపై విశ్వాసం కల్గాలని ప్రభుత్వ పథకాల అమలును అవినీతి రహితంగా ప్రజలకు అందేలా చూడాలని సూచించారు. అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 14400 నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్గించి, ప్రజలకు సహకరించని ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి శిక్షపడేలాలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాలు, సబ్-రిజిష్ట్రేషన్ ఆఫీసులు, మున్సిపల్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ శాఖ లపై నిఘా ఉంచాలని కోరారు. అవినీతి లేని పారదర్సక పాలన అందించాలనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి చిత్తశుద్దితో కృషి చేసి, ప్రజలలో ఎసిబిపై విశ్వాసం పెంచాలని, ఉద్యోగులలో అవినీతి ఆలోచన రాకుండ చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డిజిపి గౌతమ్ సవాంగ్,ఎసిబి ఛీఫ్ విశ్వజిత్ తదితరులు పాల్గోన్నారు.