శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

0
265

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
ఆపద మొక్కులవాడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.జనవరి 6వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆలయ శుద్ది కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహించారు. ఉగాది,ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది.వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం మూలవిరాట్టును పట్టు పరదలతో పూర్తిగా కప్పేసి ఆనంద నిలయం,బంగారు వాకిలి,ఉప దేవాలయాలు,ఆలయ ప్రాంగణం,పూజ పాత్రలను అర్చకులు,ఆలయ సిబ్బంది శుభ్రపరుస్తారు.

శుద్ధి తర్వాత నమపు కొమ్ము,శ్రీ చూర్ణం,పచ్చ కర్పూరం,గంధం పొడి,కుంకుమ,కిచిలి గడ్డలతో శాస్త్ర్రోక్తంగా తయారు చేసిన సుగంథం వెధచల్లే పరిమళం అనే ద్రవ్యాన్ని గోడలకు పై పూతగా పూసి అనంతరం శ్రీవారికి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. టీటీడీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా అష్టదల పాదపద్మారాధన సేవ రద్దు చేసింది.ఆలయ అర్చకులు సుప్రభాతం,తోమాల,అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.