పిలిప్ఫీన్స్‌పై విరుచుకుపడ్డ తుఫాన్‌….స్తంభించిన జనజీవనం

0
194

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
తూర్పు ఆసియా దేశమైన పిలిప్పీన్స్‌లో తుపాను తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా విరుచు కుపడిన ఫాన్ఫోన్‌ తుపాను జనజీవనాన్ని స్తంభింపజేసింది.ఫాన్ఫోన్‌ విలయంతో 16 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపడు తున్నారు.తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.తుపాను ప్రభావంతో చెట్లు విరిగిపడుతున్నాయి.చాలాచోట్ల ఇళ్లు కూడా కూలాయి.