ఆర్యోగానికి సిరి…ఉసిరి…చలికాలంలో అనేక ఉపయోగాలు

0
116

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
చలికాలంలో ఉసిరికాయలు మనకు ఎక్కువగా లభిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని ఈ సీజన్‌లో ఎవరూ మరిచిపోకూడదు. కచ్చితంగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని రక్షిస్తుంది. ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో ఉసిరిని తీసుకొంటే కలిగే ప్రయోజనాలు ఇవే

  • ఉసిరికాయల్లో విటమిన్‌ సి మనకు సమృద్ధిగా లభిస్తుంది.నారింజ,నిమ్మ,దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్‌ సి మనకు ఉసిరికాయల్లోనే దొరుకుతుంది.అందుల్ల ఈ సీజన్‌లో ఉసిరికాయలను తీసుకుంటే విటమిన్‌ సి లోపం రాకుండా చూసుకోవచ్చు.
  • ఉసిరికాయల్లో ఉండే విటమిన్‌ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరం రాకుండా చూస్తుంది.
  • శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
  • డయాబెటిస్‌ ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది.దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది.షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
  • శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి.దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.