జనసేనకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజురవితేజ రాజీనామా

0
61

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
జనసేన అధినేత Vపవన్ సన్నిహితుడు,జనసేన పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు.ఇకపై పవన్‌తో గానీ,ఆయన పార్టీతో గానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నానని పేర్కొన్నాడు.ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన రాజు రవితేజ అందులో పవన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు.

పార్టీ భావజాలం,పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించి,పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శి నేను.ప్రస్తుతం నేను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని.పవన్ గారి కోరిక మేరకు నేను ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను.ఇక మీదట నేను కల్యాణ్ గారితో కలిసి పని చేయను.ఆయనతో, జనసేన పార్టీతో సంబంధం కలిగి ఉండను.ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ కల్యాణ్ గారు కక్షసాధింపుతనం,కుల,మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయాడు.రాజకీయ,సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించడానికి అతడిని అనుమతించకూడదు.

పవన్ కల్యాణ్ గారు ఎలాంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు.అనర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా వెళ్లిపోతుంది అని తన ప్రకటనలో పేర్కొన్నారు.అంతేకాదు పవన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజు రవితేజ ఆయన సమాజానికి ప్రమాదకరం అని చెప్పడం గమనర్హం. మరోవైపు రవితేజ రాజీనామాను జనసేన పార్టీ ఆమోదించింది. పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నాము.గతంలో కూడా ఆయన ఇలాంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి పార్టీలోకి వచ్చారు.ఆయనకు మంచి భవిష్యత్,ఆయన కుటుంబానికి శుభం కలగ చేయాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.