అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు…డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష

0
63

మనఛానల్‌ న్యూస్‌ – వైఎస్సార్‌ కడప
ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేసి భక్తులకు సులువైన మార్గం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు.కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి చేపట్టిన తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు.

వైఎస్సార్‌ జిల్లా పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం ఆకేపాటిని కలిసి ఆశీస్సులు పొందారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.17వసారి మహా పాదయాత్ర చేపట్టిన ఆకేపాటి దంపతులకు ఏడుకొండల స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌ బాబు ఆకాంక్షించారు.