మనఛానల్ న్యూస్ – మదనపల్లె
కేంద్ర,రాష్ట్రాల్లోని పలు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రముఖ సి.ఎం.రెడ్డి అకాడమీ వారి ఆధ్వర్యంలో రెండురోజులపాటు అవగాహన సదస్సు నిర్వహించ నున్నారు.చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలోని మార్పురివీధి మెట్రో కాంప్లెక్స్ నందు డిసెంబర్ (14,15 తేదీలు) శని,ఆదివారాల్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆర్థమేటిక్,రీజనింగ్ నిపుణులు మహేంద్ర అగర్వాల్ మరియు జి.సుబ్ర మణ్యం రెడ్డి,ఎక్స్ ఆర్మీ (విష్ణు డిఫెన్స్) అకాడమీ వారి ఆధ్వర్యంలో ఎస్.ఐ,కానిస్టేబుల్,మిటరీ & పారా మిలటరీ, ఏపీపీస్సీ గ్రూప్స్,ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ, ఆర్మీ,ఎయిర్ ఫోర్స్,నేవీ,బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని సదస్సు నిర్వాహకు లు సి.ఎం.రెడ్డి తెలిపారు.కావున మదనపల్లె డివిజన్లోని నిరుద్యోగ అభ్యర్థులు,పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిుపునిచ్చారు.మరిన్ని వివరాలకు 7799023689, 7794023689 అనే మొబైల్ నెంబర్లను సంప్రదించాలన్నారు.