షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌…సిట్‌ను ఏర్పాటు చేసిన టీసర్కార్‌

0
34

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశను హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి విదితమే.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది.

వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి,రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్,సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.అంతేకాదు ఈ ఘటనలో పాల్గొన్న పోలీసుల వివరాలను సిట్ సేకరించనుంది.కాగా,సోమవారం ఉదయం తెలంగాణ హైకోర్టులో దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది.