మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశవ్యాప్తంగా మహిళలు,విద్యార్థినీలు,చిన్నారులపై అత్యాచారాలు,అఘాయిత్యాలు పెరిగిపోతు న్నాయి.మానవతా విలువలను పూర్తిగా మంటకలిసిపోతున్నాయి.ఇటీవలి హైదరాబాద్ శివార్లలో అత్యాచారం,హత్యకు గురైన దిశ ఘటన మరువక మునుపే యూపీలోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.తమపై రేప్ కేసు పెట్టిందని ఆక్రోశంతో ఐదుగురు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.
తీవ్రగాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఉన్నావ్ బాధితురాలు శుక్ర వారం కన్నుమూశారు.90 శాతం కాలిన గాయాలతో గురువారం బాధితురాలు లఖ్‌నవూ ఆస్పత్రిలో చేరింది.బాధితురాలి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. రాయ్ బరేలీ కోర్టుకు వెళుతుండగా ఉన్నవ్ జిల్లా సింధూపూర్ వద్ద బాధితురాలిపై దాడి జరిగింది.గురువారం మెజిస్టేట్కు బాధితురాలు వాగ్మూలం ఇచ్చింది.
వాగ్మూలంలో తనపై దాడి చేసి నిప్పు పెట్టిన వారి పేర్లను బాధితురాలు తెలిపింది.దవాఖానలో చికిత్స పొందుతూ రాత్రి 11:40 గంటలకు మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.మరోవైపు ఈ కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఉన్నావ్ ఏఎస్పీ వినోద్ పాండే సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.ఇదిలా ఉండగా యుపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు.దోషులకు కఠినశిక్షలు పడేలా చూస్తామన్నారు.అయితే హైదరాబాద్ దిశకు జరిగిన న్యాయమే తమ కూతురుకు జరగాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.