ఇకపై సెలవురోజుల్లోనూ నెఫ్ట్‌ లావాదేవీలు…ఆర్‌బీఐ కీలక నిర్ణయం

0
68

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌

డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహించే విధంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 16 నుంచి రోజంతా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) లావాదేవీలు జరుపుకునే అవకాశం కల్పించింది. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రోజంతా,ముఖ్యంగా సెలవు రోజుల్లో కూడా నెఫ్ట్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చును.ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి.

అలాగే మొదటి,మూడో శనివారాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పనిచేస్తున్నది.డిజిటల్ లావాదేవీలు జరిపే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 16 నుంచి 24X7 అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ నేపథ్యంలో నిధుల కొరత రానీయకూండా బ్యాంక్‌లు కీలక చర్యలు చేపట్టాలని,తద్వారా కస్టమర్లకు నిధుల కొరత నుంచి ఉపశమనం లభించనున్నదని పేర్కొంది.నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు పంపుకునే వీలుంటుంది.