
మనఛానల్ న్యూస్ – విశాఖపట్నం
విశాఖ సాగరతీరంలో భారత నావికా దళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.నౌకదళ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ విన్యాసాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిలకించారు.971లో పాకిస్తాన్‌పై యుద్దం లో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది.పాకిస్తాన్‌పై గెలుపుకు ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే ను నిర్వహిస్తారు.తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నేవీ విన్యాసాలను తిలకించి నేవీ సిబ్బందిని అభినందించారు.సీఎం జగన్ సాయంత్రం 5.30 గంటల వరకు నేవీ విన్యాసాలను తిలకిస్తారు.అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్ హౌస్‌కు చేరుకుంటారు.6.10 గంటలకు నేవీ హౌస్‌కు బయలుదేరతారు.6.20 నుంచి 7 గంటల వరకు అక్కడ జరిగే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు.ఏడు గంటలకు నేవీ హౌస్ నుంచి నేరుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు.రాత్రి 7.30 గంటలకు విమానంలో బయలుదేరి 8.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.