విరిగిపడ్డ మంచుచరియలు – కశ్మీర్‌లో నలుగురు జవాన్ల మృతి

0
35

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
భూతలస్వర్గం కశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది.మంచు చరియలు విరిగిపడి నలుగురు సైనికులు మృతిచెందారు.ఉత్తర కశ్మీర్‌లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కుప్వారా జిల్లా తంగ్ధార్‌ సైనిక స్థావరానికి సమీపంలో మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంచు చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

దీంతో నలుగురు సైనికులు అందులో చిక్కుకుపోయారు.వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది.ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒకరిని సురక్షితంగా రక్షించ గలిగారు.బందీపొర జిల్లా గురెజ్‌ సెక్టార్‌లో మరో ప్రమాదం జరిగింది.పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సైనికులకు మంచుచరియలు విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో ఒక జవాన్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.