భూసేకరణను వేగవంతం చేయండి – తహశీల్ధార్లకు జేసీ మార్కండేయులు ఆదేశం

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులు తహసీల్దార్ లను ఆదేశించారు. బుధవారం మద్యాహ్నం సబ్ కలెక్టర్ కార్యాలయం,సబ్ కలెక్టర్ చాంబర్ నందు మదనపల్లె,తంబళ్లపల్లె, రొంపిచెర్ల,కలికిరి, పలమ నేరు,కుప్పం ఆరు మండలాలకు చెందిన తహశీల్దార్లు,మదనపల్లి మునిసిపాలిటీకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లతో సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకురితో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారు ఆదేశాల మేరకు రాబోయే ఉగాది పండగ నాటికి జిల్లాలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థాలాలు పంపిణీ చేయా లని ఆదేశించారని తెలిపారు.సంబందిత మండల పరిధిలో గృహాలకు అర్హత కలిగిన వారి నుండి ఇప్పిటికే ధరకాస్తులు స్వీకరించడం జరిగిందని,వీరికి అవసరమగు ప్రభుత్వ భూములు గుర్తించాలని తెలిపారు.

వారందరికీ ప్రభుత్వ భూమిని అందుబాటులో ఉండేటుగా భూ సేకరణను వేగవంతంగా తయారు చేయాలని తహసీల్దార్లుకు సూచించారు.మండల పరిధిలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంత ఉన్నా యనే వివరాలను సేకరణ చేసి నివేదికలను పంపించాలని,ప్రభుత్వ భూమితో పాటు డి.కే.టి భూములను అవసరమైతే ప్రైవేట్ భూములను కూడా గుర్తించి అందుబాటులో ఉంచాలని తహసీల్దార్లకు సూచించారు.

మదనపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూములు ఉన్న చోట భూ ఆక్రమణకు గురి కాకుండా హెచ్చ రిక బోర్డులను ఏర్పాటు చేసి ఉన్నామని మదనపల్లి తహసీల్దార్ సురేష్ బాబు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సంయుక్త కలెక్టర్ గారికి చూపించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ షంషీర్ ఖాన్,ఆరు మండలాలకు సంబందించిన తహసీల్దార్లు యుగంధర్,శ్రీనివాసులు,రవీంద్రా రెడ్డి, చంద్రమ్మ, మదనపల్లి మునిసిపాలిటీ నుండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.