బీజేపీకి ఏప్పుడూ దూరంగా లేను…జనసేనాని పవన్‌ వ్యాఖ్యలు

0
49

మనఛానల్‌ న్యూస్‌ – తిరుపతి
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు,బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని ఈ విషయంలో వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని ఆయన కామెంట్లు చేశారు.ఇక తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అన్న పవన్ ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే ఆ పార్టీతో విభేదించానని చెప్పుకొచ్చారు.అందుకే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని. ఇప్పటికీ తాను బీజేపీతో కలిసే ఉన్నానని స్పష్టతను ఇచ్చారు.

దేశ ప్రయోజనాలు,ప్రజల కోసం బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ప్రశంసలు కురి పించారు.ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఆయన మాటల తూటాలు పేల్చారు.కియా కంపెనీ సీఈవోను వైసీపీ ఎంపీ వేలు చేపించి బెదిరించారని పవన్ గుర్తుచేశారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటే ఏ పరిశ్రమలు వస్తాయా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.వైసీపీ నేతలు తన ప్రతి మాటన వక్రీకరిస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చేశారు.