దిశ కేసులో కీలక మలుపు…ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శంషాబాద్‌ వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి (దిశ) హత్యకేసులో కీలక మలుపు తిరిగింది.ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది.ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.మహబూబ్‌నగర్‌లో ఈ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు కానుంది.

దిశ హత్యాచారం,హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాని సీఎం కేసీఆర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు.ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడంతో 56 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది.అదే తరహాలోనే ఈ కేసులోనూ సత్వర తీర్పు రావాల్సిన అవసరముందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.