చిదంబరానికి ఊరట – ఐఎన్‌ఎక్స్‌ కేసులో బెయిల్‌ మంజూరు

0
39

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరానికి ఊరట లభించింది.బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.ఆగష్ట్‌ 21న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయనను తీహార్‌ జైలులో ఉంచింది.105 రోజులపాటు ఆయన జైల్లోనే గడిపారు.పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది.బుధవారం రూ.2 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది.అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరితో మాట్లాడకూడదని సూచించింది.