కడప స్టీల్‌ఫ్లాంట్‌ కల సాకారం…ఈనెల 26న సీఎం జగన్‌ చేత శంకుస్థాపన

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.వైఎస్సార్‌ జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్ద నందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.డిసెంబర్‌ 26న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేయనున్నారు.2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్‌లో రూ.250కోట్లను కేటాయించారు.ఇబ్రహీంపట్నంలోని ఇన్‌క్యాప్‌ కార్యాల యాన్ని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ రిజిస్టర్‌ కార్యాలయంగా పేర్కొన్న ప్రభుత్వం పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ,గనుల శాఖ కార్యదర్శి కె.రామ్‌ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.