ఐటీబీపీ జవాన్ల మధ్య తలెత్తిన ఘర్షణ…ఆరుగురి మృతి

0
20
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లాలోని ఇండో – టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళం జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.నారాయణ్‌పూర్‌ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని కడెనార్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఐటీబీపీ 45వ బెటాలియన్‌ జవాన్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

ప్రాథమిక సమాచారం మేరకు రెహమాన్‌ ఖాన్‌ అనే జవాను తన సర్వీసు తుపాకీతో తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు.అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.ఈ ఘటనలో రెహమాన్‌ ఖాన్‌ సహా మరో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.సెలవు దొరకలేదనే కారణంతోనే తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటన ను నారాయణ్‌పూర్‌ జిల్లా ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ ధ్రువీకరించారు. జవాన్ల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసిందని ఆయన వెల్లడించారు.