మార్చి 4 నుండి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు – షెడ్యూల్‌ విడుదల

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియెట్‌ మొదటి,రెండో సంవత్సర పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ సోమవారం ప్రకటించింది.వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మార్చి 23 వరకు వీటిని నిర్వహించను న్నారు.ఈ మేరకు బోర్డ్‌ కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను విడుదల చేశారు.నైతిక విలువలు (ఎథిక్స్‌), మానవ విలువలు (హ్యూమన్‌ వ్యాల్యూస్‌) సబ్జెక్టుల పరీక్షలు జనవరి 28న,పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న జరగనున్నాయి.ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించ నున్నారు. ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు కూడా ఇవే తేదీల్లో జరుగుతాయి.ఆ పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు.

ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే….