
మనఛానల్ న్యూస్ – వైఎస్సార్ కడప
తిరుపతి నుండి షిర్డీ వెళ్లే సాయినాథ్ ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం రైల్వేకోడూరు రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది.ఇంజిన్ వెనుక ఉన్న జనరల్ బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ఈ ఘటన తిరుపతి నుంచి షిర్డీ వెళ్తుండగా చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.ఘటనాస్థలిలో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.