జేఎన్‌టియుఎ బాస్కెట్‌బాల్‌ టీంకు ఎంపికైన మదనపల్లె మిట్స్‌ విద్యార్థి

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు బి.టెక్ మొదటి సంవత్సరము సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న కె.ప్రేమ్ కుమార్ అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (జె.యెన్.టి. యు.ఏ) పురుషుల విభాగంలో బాస్కెట్‌బాల్ టీంకు ఎంపికయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.

ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఈ నెల 7 నుండి 11 వరకు తమిళనాడు రాజధాని చెన్నైలోని హిందూస్తాన్ ఇనిస్టిట్యూట్‌లో జరిగే పోటీలలో యూని వర్సిటీ టీం తరుపున పాల్గొంటాడని ఆయన అన్నారు.ఎంపికైన విద్యార్ధిని కళాశాల యాజ్యమాన్యం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్,సీనియర్ పీడీ వెంకటరమణ,ఫిజికల్ డైరెక్టర్ విలియమ్స్, అధ్యాపకులు మరియు తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.