చిత్తూరుజిల్లాలో ఏనుగుల బీభత్సం – పంటపొలాలు ధ్వంసం

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బంగారుపాళ్యం
చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం మొగలివారిపల్లె సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిన్న విద్యుత్‌ షాక్‌తో ఓ ఏనుగు చనిపోయిన సంగతి తెలిసిందే.అయితే చనిపోయిన ఏనుగు కోసం ఏనుగుల గుంపు వచ్చింది.అంతే ఆ గుంపు పంటపొలాలపై పడి ధ్వంసం చేశాయి. చనిపోయిన ఏనుగులను ఖననం చేసిన చోట ఒక గొయ్యిని తవ్వాయి.దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.ఇలా చనిపోయిన ఏనుగు కోసం వచ్చిన ఏనుగుల గుంపు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు గ్రామస్తులు.