ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన టిడిపి నేతలు

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ రాజధాని అమరావతి పర్యటన సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత,ప్రతిపక్ష నేత చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఆనాటి సంఘటనను వివరించారు.అనంతరం ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాజధానిపై సీఎం జగన్‌,మంత్రు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని చెప్పేందుకు అమరావతిలో చంద్రబాబు పర్యటించారన్నారు.

గవర్నర్‌ వాస్తవాలు గ్రహించి మా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.పోలీసు కుట్రతోనే చంద్రబాబుపై దాడి జరిగిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.జనాల్ని బయటి నుంచి తీసుకొచ్చి వైకాపా దాడి చేయించిందని మండిపడ్డారు.మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళను అరెస్ట్‌ చేశారు.బాధ చెప్పుకున్న మహిళను అరెస్ట్‌ చేయడం దారుణం.అసభ్య పదజాలం వాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు.చంద్రబాబు పర్యటనలో వాడిన బస్సులను సీజ్‌ చేశారు.బస్సు డ్రైవర్‌,కండక్టర్‌ను అదుపులోకి తీసుకొని ఇబ్బంది పెడుతున్నారన్నారు.