ఉల్లి ధరలపై ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ సమీక్ష

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
దేశ వ్యాప్తంగా ఉల్లి రేట్లు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తుంది. నవంబర్‌ 2న ఒక్కరోజే కిలో ఉల్లి రూ.90కి చేరింది.అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకాడకుండా దాదాపు 548 క్వింటాళ్ళు ఒక్కరోజే కొనుగోలు చేసి రూ.25కే కిలో చొప్పున సామాన్యు లకు అందుబాటులో ఉండేలా రైతు బజార్లకు చేర్చింది.

దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం చేపట్టారు.గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.సబ్సిడీ ఉల్లిపాయలు రైతుబజార్ల ద్వారా విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకో వాలన్నారు.

అక్రమంగా ఉల్లిపాయల నిల్వలు చేస్తే వారిపై మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ,విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంతవరకూ ఇదే విధంగా అమ్మాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా సామాన్యులకు మాత్రం రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం పేర్కొన్నారు.