
మనఛానల్ న్యూస్ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయ విద్యార్థులు జుడీ స్టాన్లీ(23), వైభవ్ గోపిశెట్టి(26) టెనెస్సీ స్టేట్ యూనివర్సిటీ (టీఎస్‌యూ)లో ఫుడ్ సైన్స్ కోర్సు చదువుతున్నారు. వీరి ద్దరూ నవంబర్ 28న జరిగిన ఓ పార్టీ నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు.ఇంతలో వేగంగా వస్తున్న ట్రక్కు వీరి కారును ఢీ కొట్టడంతో టెనెస్సీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో విద్యార్థులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.దీంతో ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టారెస్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.కాగా మృతుల్లో ఒకరైన వైభవ్ గోపిశెట్టి విజయవాడకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.భారతీయ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై టెనెస్సీ యూనివర్సిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.స్వదేశంలో జరిగే వీరి అంత్యక్రియల కోసం యూనివర్సిటీ విద్యార్థులు ‘గో ఫండ్ మీ పేజ్’ను ఏర్పాటు చేసి 42వేల డాలర్లు సేకరించారు.