బంగారం కొంటున్నారా..???కొత్త నిబంధనలు తెలుసుకోండి..!!!

0
313

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
భారతీయులకు బంగారం అంటే..అలివికాని ఆశ..ముఖ్యంగా మహిళలకు అయితే బంగారు ఆభరణాలంటే ఎంత మక్కువొ చెప్పక్కరలేదు. మోది ప్రభుత్వం బంగారు ఆభరణాల కొనుగోలుకు కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు మెున్నటి వరకు పెద్ద ప్రచారం జరిగింది.అయితే అది అంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాల నాణ్యత విషయంలో చట్టం తీసుకురానుంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలకు తప్పనిసరిగా హోల్ మార్కు గుర్తు ఉండాలనే నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఈ హోల్ మార్కు విధానం భారత్ లో 2000 ఏప్రిల్‌ నుంచే ధ్రువీకరించే విధానాన్ని బీఐఎస్‌ ఆచరణలోకి తీసుకొచ్చింది.అయితే దీన్ని అప్పట్లో తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి.దీనివల్ల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పుతున్నారు. ఈ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ 2020 జనవరి 15వతేదిన వెలువడుతుంది. 2021 జనవరి15 నుంచి బంగారు ఆభరణనాలకు హోల్ మార్కు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన అమలులోకి రానుంది. చట్టం కఠినంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బంగారు దుకాణాలలో 2021 జనవరి15 తర్వాత హాల్ మార్క్ లేని బంగారం అమ్మకాలు చేస్తే రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బంగారానికి హోల్ మార్కు వేయడానికి రూ.50లు వ్యయం అవుతుందని ప్రభుత్వం గుర్తించింది.అలాగే బంగారం విక్రయించే వర్తకులు తప్పనిసరిగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బంగారం దుకాణం దారులు 2021 జనవరి15లోపు తమ దుకాణాలలోని బంగారానికి హోల్ మార్కు వేసుకోవాలి. లేదా ఉన్న బంగారాన్ని అమ్ముకోని ఖాళీ చేయాలి.ప్రజలవద్ద వాడుకలో ఉన్న పాత బంగారానికి ఈ నిబంధన వర్తించదు. ప్రభుత్వం హోల్ మార్క్ గుర్తులు వేస్తుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 877 హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ బి.ఐ.ఎస్ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఆ కేంద్రాలలో తమ సంస్థలను దుకాణాదారులు రిజిష్ట్రర్ చేయించుకోవాలి. బంగారం దుకాణాలలో వ్యాపారులు ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలు మాత్రమే విక్రయించాలి. ప్రస్తుతం వినియోగదారులపై ఏమాత్రం నిబంధనలు పెట్టలేదు. భవిష్యత్ లో మరిన్నీ సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది.