యూఎస్‌ఏలో 90 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

0
196

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
అమెరికాలోని ఫార్మింగ్‌టన్‌ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.డెట్రాయిట్ లోని ఫార్మింగ్‌ టన్ ఫేక్‌ యూనివర్శిటీని మూసివేసిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అందులో చేరిన 250 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్‌ అయిన వారిలో 90మంది భారతీయ విద్యార్థులున్నా రని తేలింది.

స్డూడెంట్స్‌ అరెస్ట్‌ తో పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా డెమోక్రటిక్ నేతలు అభివర్ణిస్తున్నారు. గ‌త మార్చి నెల‌లో యూనివ‌ర్సిటీలో 161 మంది అరెస్టు చేశారు.ఆ వ‌ర్సిటీని మూసివేసే స‌మ‌యానికి అందులో 600 విద్యార్థులు చ‌దువుతున్న‌ట్లు తెలిసిందే.